: రూ.599 ప్రారంభ ధరతో స్పైస్ జెట్ బంపర్ ఆఫర్


దేశీయ విమానయాన సంస్థలు ధరలు భారీగా తగ్గిస్తూ ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో, స్పైస్ జెట్ తాజాగా అన్ని పన్నులతో కలిపి రూ.599 ప్రారంభ ధరతో టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. నేటి నుంచి ఈ నెల 13 వరకు టిక్కెట్ల బుకింగ్ ఉంటుంది. ఈ ఆఫర్ జూలై 1 నుంచి అక్టోబర్ 24 వరకు జరిగే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా తమ సంస్థ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నట్టు స్పైస్ జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కనేశ్వరన్ అవిలి పేర్కొన్నారు. కొన్ని రూట్లలో ఏసీ ట్రైన్ల ధరలు, కొన్ని రూట్లలో నాన్-ఏసీ ట్రైన్ల ధరలతో పోలిస్తే తమ ఆఫర్ చౌక అని వివరించారు.

  • Loading...

More Telugu News