: పరువునష్టం కేసులో వ్యక్తిగత హాజరునుంచి కేజ్రీవాల్ కు మినహాయింపు
క్రిమినల్ పరువునష్టం దావా కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే కేసులో పార్టీ నేతలు మనీశ్ శిశోడియా, యోగేంద్ర యాదవ్ లకు కూడా మినహాయింపు ఇచ్చింది. ఈ ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసే విషయంలో ఈ నెల 11న కోర్టు తన ఆదేశాన్ని రిజర్వులో ఉంచింది. తాజాగా వారంతా సారధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో మినహాయింపునిచ్చింది. సురేందర్ కుమార్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశాడు.