: కడప డీసీసీబీ మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి అక్రమాలపై సీఐడీ విచారణ... 14 మంది అరెస్ట్
కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. జిల్లాలోని పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, అనంతయ్యగారిపల్లి, అనంతంపల్లిల్లోని కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయాల్లో నేటి ఉదయం సీఐడీ సోదాలు మొదలయ్యాయి. అనంతసముద్రం సొసైటీకి చెందిన పదిమందిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది. నకిలీ పాస్ బుక్కులు, నకిలీ సభ్యత్వాల పేరిట సొసైటీ పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో రుణాలను మంజూరు చేయించుకున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.