: లెఫ్ట్ పార్టీల దుస్థితి... ఒక్కరికీ డిపాజిట్టు దక్కలేదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒక్కరికి కూడా డిపాజిట్లు దక్కలేదు. సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్, ఎన్ యూసీఐ(సీ), ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్సీ, సోషలిస్టు పార్టీ కలసి 'లెఫ్ట్ ఫ్రంట్' పేరిట ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచాయి. 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగగా, కేవలం 15 మందినే అభ్యర్ధులుగా నిలిపాయి. వారిలో ఏ ఒక్కరూ గెలవలేదు సరికదా, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. రాకేష్ కుమార్ అనే అభ్యర్థికి గరిష్ఠంగా 947 ఓట్లు దక్కడం విశేషం. కనీసం వెయ్యి ఓట్లను కూడా సాధించకపోవడం లెఫ్ట్ పార్టీల పతనానికి నాందిలా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.