: పసి కూనలపై ప్రతాపం చూపిన టీమిండియా


టీమిండియా పసికూన ఆఫ్ఘనిస్తాన్ పై ప్రతాపం చూపింది. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి విజయాల కోసం మొహం వాచిన భారత జట్టు తొలిసారి పసికూనపై విజయం సాధించి ఉత్సాహం మూటగట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లతో 5 వికెట్ల నష్టానికి 364 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 150 పరుగులు చేసి ఫాం అందిపుచ్చుకోగా, సురేష్ రైనా 75 పరుగులు చేసి అతనికి చక్కని సహకారమందించాడు. రహానే మెరుపులు మెరిపించి 88 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మోహిత్ శర్మ, జడేజా చెరి రెండు వికెట్లు తీయగా, అశ్విన్, ఉమేష్ యాదవ్, రైనా తలో వికెట్ తీసుకున్నారు.

  • Loading...

More Telugu News