: ఢిల్లీలో భంగపాటు నరేంద్రమోదీ ఓటమే: ఉద్ధవ్ థాకరే
బీజేపీతో అత్యంత కష్టతరమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని పంచుకున్న శివసేన, ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయంపై తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. ఢిల్లీలో విఫలమవడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటమేనని సేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. "ఈ పరాజయానికి నరేంద్రమోదీయే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా" అని మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రతి అల (మోదీ వేవ్) కంటే సునామీ పెద్దదని ఈ ఫలితాలు నిరూపించాయని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ప్రజలు విసిగిపోయారని థాకరే వ్యాఖ్యానించారు. మరోవైపు విజయం దక్కించుకున్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.