: తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ సొత్తు కాదు: జీవన్ రెడ్డి
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ సొత్తు కాదని వ్యాఖ్యానించారు. తాను కూడా ఉద్యమంలో భాగంగా జైలుకెళ్లొచ్చానని తెలిపారు. అధికారం ఎల్లప్పుడూ ఉండదని, అందుకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. అటు, సీఎం కేసీఆర్ తనయ, ఎంపీ కవితపైనా జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆమె మాట్లాడే భాష సరిగా లేదని ఆరోపించారు. ఓర్వలేనితనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో హెచ్చరికలు, బెదిరింపులకు తావులేదన్నారు. కవిత సవ్యరీతిలో మాట్లాడాలని ఆయన హితవు పలికారు.