: ఢిల్లీ ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ... ప్రజాతీర్పును శిరసావహిస్తామని వ్యాఖ్య


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తల బొప్పికట్టగా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త ఆలస్యంగానైనా స్పందించారు. ఢిల్లీ ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం తన స్పందనను తెలిపిన రాహుల్, విజయదుందుభి మోగించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ‘‘ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఎంచుకున్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. కేజ్రీవాల్, ఆయన బృందానికి అభినందనలు’’ అని క్లుప్తంగా స్పందించారు. ఇదిలా ఉంటే, రాహుల్ తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News