: కేజ్రీవాల్ కు అభినందనల వెల్లువ
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయంపై అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ లు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు ఆప్ విజయంపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజలు ఆలోచిస్తారనడానికి తాజా ఢిల్లీ ఫలితాలే నిదర్శమని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు అవినీతి రహిత, పారదర్శక పాలనలను కోరుకుంటున్నారని అన్నారు.