: ఆప్ కార్యకర్తలకు భార్యను పరిచయం చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ఆప్ దూసుకుపోతోంది. ఇప్పటికే విపక్షాలు తమ ఓటమిని అంగీకరించేశాయి. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలిపాయి. ఈ క్రమంలో ఆప్ కార్యకర్తలతో కలసి ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనతో పాటు ఉన్న తన భార్యను ఆప్ నేతలకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, తన భార్య సహకారం లేకపోతే తానేమీ సాధించేవాడిని కాదని తెలిపారు. తన ప్రతి విజయం వెనుక తన భార్య ప్రోత్సాహం ఉందని అన్నారు.