: బెజవాడలో ఖాకీల దాష్టీకం... లాఠీ దెబ్బలకు కోమాలోకెళ్లిన యువకుడు


బెజవాడ పోలీసుల దాష్టీకాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. రాత్రి వేళ్లలో బయటకు రావాలంటే ఐడీ కార్డులుండాల్సిందేనంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసి సర్కారు ఆగ్రహానికి గురైన విజయవాడ పోలీసులు తాజాగా ఇద్దరు యువకులపై అకారణంగా లాఠీలు ఝుళిపించారు. నగరంలోని లబ్బీపేటలో రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ యువకుడు కోమాలోకి వెళ్లగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రివేళ బయటకు వచ్చిన ఆ ఇద్దరు యువకులు తమను నిలువరించిన పోలీసులను ఎందుకు ఆపారంటూ ప్రశ్నించారు. ఇదే వారు చేసిన ఘోరమైన తప్పిదం. తమను ప్రశ్నించిన యువకులపై లబ్బీపేట పోలీసులు లాఠీలు ఝుళిపించారు. లాఠీచార్జీలో కల్యాణ్ రెడ్డి అనే యువకుడు కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అక్కడకు పరుగెత్తుకొచ్చారు. దీంతో తమ తప్పు తెలుసుకున్న పోలీసులు తమ బైక్ ను అక్కడే వదిలేసి పరారయ్యారు. గాయపడ్డ యువకులను స్థానికులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News