: బాగ్దాద్ రక్తసిక్తం... 13 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నెత్తురోడింది. కదామియాలోని అదాన్ స్క్వేర్ వద్ద ఓ మానవబాంబు పేలిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మందికి గాయాలయ్యాయి. కదామియా షియా ముస్లిం ప్రాబల్య ప్రాంతం. సోమవారం ఉదయం పేలుడు జరిగింది. బాగ్దాద్ లో 12 ఏళ్లుగా అమలులో ఉన్న రాత్రివేళ కర్ఫ్యూను ప్రధాని హైదర్ అల్-అబది ఎత్తివేసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. అటు, హుస్సేనియా వద్ద రోడ్డు పక్క జరిగిన మరో పేలుడులో ఒకరు మృతి చెందారు. సాధారణ జనజీవనం నెలకొనేందుకే తాము కర్ఫ్యూ ఎత్తివేశామని ప్రధాని అల్-అబది స్పష్టం చేశారు.