: కాంగ్రెస్ భిక్షతోనే టీఆర్ఎస్ నేేతలకు మంత్రి పదవులు: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ పెట్టిన భిక్షతోనే టీఆర్ఎస్ నేతలకు మంత్రి పదవులు దక్కాయని టీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పట్ల కేసీఆర్ సర్కారు దురుసుగా వ్యవహరించిన తీరుపై ఆయన పార్టీ నేతలతో కలిసి మానవ హక్కుల సంఘానికి కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవసరం లేకపోయినా చెస్ట్ ఆసుపత్రిని కేసీఆర్ సర్కారు తరలిస్తోందని ఆరోపించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని తుమ్మల నాగేశ్వరరావుకు నేడు తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కిందని ఆయన విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.