: సరిహద్దు గ్రామాలపై మోర్టార్లతో పాక్ దాడులు
పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. అయితే ఈసారి సైనిక స్థావరాలతో పాటు సరిహద్దు గ్రామాలను కూడా లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపింది. జమ్మూ జిల్లాలో 8 అవుట్ పోస్టులపై, కొన్ని గ్రామాలపై గత రాత్రంతా దాడులు చేసిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లను పాకిస్తాన్ ప్రయోగించిందని, రాత్రి 10 గంటల నుంచి కాల్పుల శబ్దం వినిపిస్తూనే ఉందని, భారత సైన్యం సైతం ఈ దాడికి దీటైన బదులు చెప్పిందని, పాక్ కాల్పుల్లో ఒక పౌరుడికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.