: సాకర్ ఆటగాళ్లతో కూలిపోయిన విమానం ఇన్నాళ్లకు కనిపించింది!


ఎప్పుడో అర్థశతాబ్దం క్రితం ఆండీస్ పర్వత శ్రేణిలో కూలిపోయిన చిలీ విమానాన్ని ఇన్నాళ్లకు గుర్తించారు. కొందరు పర్వతారోహకులు ఈ విమాన శకలాలను చూశారు. అక్కడంతా విమాన శకలాలు, ఎముకలు ఉన్నట్టు వారు తెలిపారు. 1961 ఏప్రిల్ 3న సాకర్ ఆటగాళ్లతో ప్రయాణిస్తున్న ఈ విమానం కనిపించకుండా పోయింది. తాజాగా, శాంటియాగోకు దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలోని మౌలే ప్రాంతంలో 3200 మీటర్ల ఎత్తున శకలాలు ఉన్నట్టు తెలిసింది. కూలిపోయిన సమయంలో విమానంలో 34 మంది ఉన్నారు. వారిలో సాకర్ ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బంది తదితరులున్నారు. ఆటగాళ్లు ఒసోర్నోలో ఓ మ్యాచ్ ఆడి శాంటియాగో తిరిగి వస్తుండగా విమానం అదృశ్యమైంది.

  • Loading...

More Telugu News