: బ్రిటన్ అబ్బాయి, తెలుగింటి అమ్మాయి... ఒకటైన వేళ!


పుట్టిన దేశాలు వేరు, పెరిగిన సంప్రదాయాలు వేరు! అయితేనేం... వారి మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా మారింది. వారి వివాహానికి పెద్దల అంగీకారం తోడయింది. అంతే... విశాఖ, రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్ వేదికగా ఆ జంట హిందూ వివాహ సంప్రదాయంలో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. బ్రిటన్‌ కు చెందిన మోరిస్ విలియం డీన్‌కు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బండి నేహతో జరిగిన వివాహానికి వరుడి తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు హాజరై నవ దంపతులను దీవించారు. నేహ యూకేలో ఎంఎస్ (ఎకనామిక్స్) చదువుతున్న సమయంలో సహ విద్యార్థి విలియం డీన్‌ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ప్రస్తుతం నేహ జర్మనీలో, విలియం యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. తమకు తెలుగు సంప్రదాయం నచ్చిందని, తమ దేశంలో ఇలాంటి వివాహ విధానం లేదని, నేహ తమ కుటుంబంలో సభ్యురాలు అయినందుకు హ్యాపీగా ఉందని చెబుతున్నారు విలియం తల్లిదండ్రులు.

  • Loading...

More Telugu News