: వాళ్లను చూసి నేర్చుకోండి: టీమిండియాకు అమర్ నాథ్ సూచన
డిఫెండింగ్ చాంప్ టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని మాజీ కెప్టెన్ మొహిందర్ అమర్ నాథ్ విమర్శించారు. చాంపియన్లుగా వెలుగొందిన కాలంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఎలా ఆడాయన్న అంశాన్ని టీమిండియా పరిశీలించాలని సూచించాడు. డిఫెండింగ్ చాంప్ హోదాలో ఎలా ఆడాలో ఆ జట్లను చూసి నేర్చుకోవాలని, ప్రతికూల ధోరణి విడనాడాలని సలహా ఇచ్చాడు. టీమిండియా టాపార్డర్ లో ముఖ్యంగా ధావన్, కోహ్లీ భారీ స్కోర్లు సాధించలేకపోవడమే టీమిండియా కష్టాలకు కారణమని విశ్లేషించాడు. జట్టును చూస్తే చాంపియన్ టీంలా కనిపించడం లేదని విమర్శించాడు. ఆసీస్ తో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో ఓటమిపాలైన నేపథ్యంలో ధోనీ సేనపై మాజీల విమర్శలు ఎక్కువయ్యాయి.