: ‘డిప్యూటీ’ ఇస్తే... నితీశ్ ను బలపరుస్తా: మాటమార్చిన బీహార్ సీఎం మాంఝీ


బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ మాట మార్చారు. సీఎం పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే విశ్వాస పరీక్షలో తన బలమేంటో చూపిస్తానని నిన్న రాత్రి దాకా బెట్టు చేసిన ఆయన, తాజాగా ఓ మెట్టు దిగారు. నితీశ్ కుమార్ సీఎం పదవి చేపడితే తనకేమీ ఇబ్బంది లేదని, అయితే, డిప్యూటీ సీఎం పదవి మాత్రం తనకే ఇవ్వాలని ఆయన నేటి ఉదయం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. నిన్నటి దాకా పార్టీపై యుద్ధం సాగించిన మాంఝీ, తెల్లవారేసరికి మాటమార్చడం వెనుక కారణాలేమై ఉంటాయన్న విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News