: నీతి ఆయోగ్ లో ‘టీమిండియా’...సభ్యులుగా కేంద్రం, రాష్ట్రాల ప్రతినిధులు!


ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా రంగంలోకి దిగిన నీతి ఆయోగ్ లో మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్నటి నీతి ఆయోగ్ తొలి భేటీ సందర్భంగా ఆయన ప్రకటించిన కొత్త కమిటీలో ఓ కమిటీకి ‘టీమిండియా’ అనే పేరు పెట్టారు. వివిధ ప్రభుత్వ పథకాల రూపకల్పన, వాటి అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీమిండియా సలహాలిస్తుందట. ఈ కమిటీలో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకే ఈ కమిటీ పనిచేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News