: అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటీ


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఢిల్లీలోని నీతిఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆయనకు వివరించారు. నిధుల కొరత తీవ్రంగా ఉందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన పూర్తి నిర్లక్ష్యంగా, అసంబద్దంగా జరిగిందన్న సంగతి తెలిసిందేనని ఆయన జైట్లీకి వివరించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News