: బద్రి మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్, చిరంజీవి సంతాపం
టీవీ9 న్యూస్ రీడర్ బద్రి (కల్లా వీరభద్రయ్య) మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు. నేటి ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్రి దుర్మరణం పాలయ్యారు. కారు టైరు పేలిపోవడంతో అదుపు తప్పిన బద్రి కారు చెట్టును ఢీకొట్టింది. బద్రి మరణ వార్త తెలియగానే కేసీఆర్, వైెస్ జగన్, చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కూడా బద్రి మృతికి సంతాపం ప్రకటించారు.