: కోటి మంది బలం లేని కాంగ్రెస్ కోటి సంతకాలెలా సేకరిస్తుందో: ఏపీ డిప్యూటీ సీఎం విస్మయం


ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ ఆందోళనలపై సెటైర్లు విసిరారు. కోటి మంది బలం కూడా లేని ఆ పార్టీ కోటి సంతకాలెలా సేకరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ మరో డిప్యూటీ సీఎం హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ఆయన తన సొంత జిల్లా కర్నూలులో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్ నేతల వైఖరిపై కేఈ విస్మయం వ్యక్తం చేశారు. కోటి మంది సభ్యత్వం లేని కాంగ్రెస్ పార్టీ, కోటి సంతకాలు సేకరిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News