: పోలింగ్ బూత్ కు వెళ్లి... ఓటేయకుండా వచ్చిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పోలింగ్ స్టేషన్ కు వెళ్లి కూడా ఓటేయకుండా వచ్చేశారు. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రపతి భవన్ లో ఉన్న మోడల్ పోలింగ్ స్టేషన్ కు ప్రణబ్ దాదా ఈ ఉదయం వెళ్లారు. అయితే, ఆయన తన ఓటు హక్కును మాత్రం వినియోగించుకోలేదని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రణబ్ తన ఓటు హక్కును వినియోగించుకోని సంగతి తెలిసిందే. ఓటు వేస్తే, ఏదో ఒక పార్టీకి మద్దతు పలికినట్టు అవుతుందని భావించడం వల్లే రాష్ట్రపతి ఓటు వేయలేదని రాష్ట్రపతి భవన్ వర్గాల సమాచారం.