: లోకేష్ తో భేటీ అయిన వైకాపా ఎమ్మెల్యే
టీడీపీ యువనేత నారా లోకేష్ తో గూడూరు వైకాపా ఎమ్మెల్యే సునీల్ భేటీ అయ్యారు. నెల్లూరులో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటిలో జరుగుతున్న వివాహానికి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ తో వైకాపా ఎమ్మెల్యే సునీల్ సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో, పలు ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి. సునీల్ పార్టీ మారుతున్నారనే వార్తలు గతంలో కూడా వచ్చాయి. అయితే, అప్పట్లో ఆ వదంతులను ఆయన ఖండించారు. కానీ, ఈ రోజు జరిగిన భేటీ వెనుక మాత్రం కచ్చితంగా ఏదో ఉద్దేశం ఉందని పలువురు భావిస్తున్నారు.