: ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు: యనమల
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచారన్న వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. పెరిగిన విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద పడనీయమని టీడీపీ యువనేత లోకేష్ కామెంట్ చేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ప్రస్తుతానికి విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేవలం ఈఆర్ సీ నివేదిక ఆధారంగానే ఛార్జీల పెంపు ఉంటుందని ఆయన అన్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిరంతరం వస్తూనే ఉంటాయని తెలిపారు. కేంద్ర నిధులపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో మాట్లాడతారని చెప్పారు.