: బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంటుంది: కేంద్రమంత్రి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంపై బీజేపీ నేత, కేంద్రమంత్రి హర్షవర్థన్ ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక గెలుపును నమోదు చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుందంటూ ముందస్తు సర్వేల్లో వెల్లడవటంపై ఆయనను అడగ్గా, "అది నిజమని మేం భావించడం లేదు. బీజేపీ విజయం సాధిస్తుందని వందశాతం నేను నమ్మకంగా ఉన్నా. ఫలితాలు వచ్చేంతవరకు ఇలాంటి పోల్ సర్వేలపై నేనెలాంటి వ్యాఖ్యలు చేయను" అని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో ఆయన పైవిధంగా స్పందించారు.