: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ!


నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకగా, చికిత్స కోసం హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. చికిత్స పూర్తయి ఆయన కోలుకున్నారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తన సన్నిహితులతో ఎస్పీవై రెడ్డి చెప్పారట. అయితే, కేర్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎస్పీవై రెడ్డి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ, గత నెల 10న కేర్‌లో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. ఆ తరువాత కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉన్న ఆయన వ్యాధి నయమయ్యాక డిశ్చార్జ్ అయ్యారు.

  • Loading...

More Telugu News