: వెంకయ్యనాయుడు మతిమరుపు వెంకయ్యగా మారిపోయారు: ఏపీ పీసీసీ


కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై ఏపీ పీసీసీ విమర్శనాస్త్రాలు సంధించింది. విభజన చట్టం ప్రకారం ఏపీలో అమలు చేయాల్సిన హామీలను ఆయన మర్చిపోయారంటూ మండిపడింది. ఈ క్రమంలో, వెంకయ్యనాయుడు మతిమరుపు వెంకయ్యగా మారిపోయారని వ్యంగ్యం ప్రదర్శించింది. అంతేగాకుండా, వెంకయ్యనాయుడికి లేఖ రాసింది. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు వెంకయ్యనాయుడి వైఖరిని తూర్పారబట్టారు.

  • Loading...

More Telugu News