: ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా, కేజ్రీవాల్, షీలాదీక్షిత్... ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రముఖులు పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఔరంగజేబ్ లేన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీకే దత్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ తదితరులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.