: పోలీసులా? టీఆర్ఎస్ ఏజెంట్లా?: దానం ఫైర్


తెలంగాణ పోలీసులు గులాబీ దుస్తులు ధరించిన టీఆర్ఎస్ ఏజెంట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో టీఆర్ఎస్ తలపెట్టిన కార్యక్రమాలన్నింటికీ అనుమతులు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాదయాత్రకు టీఆర్ఎస్ సర్కారు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఛాతీ ఆసుపత్రిని తరలిస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. కాగా, సచివాలయం, చెస్ట్‌ ఆసుపత్రి తరలింపును నిరసిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేడు పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, దీనికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News