: చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు: కత్తి పద్మారావు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి లేకుండా చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. పొన్నూరులో శుక్రవారం నాడు ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు నవ్యాంధ్రతో దోబూచులాడుతున్నారని విమర్శించారు. అప్పట్లో ఎన్టీ రామారావు ఢిల్లీలో నిధుల కోసం డిమాండ్ చేస్తే... తద్విరుద్ధంగా నేడు చంద్రబాబు నిధుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమం చేపడతామని పద్మారావు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News