: విద్యుత్ చార్జీలు పెంచినా ఇబ్బంది లేదంటున్న నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని టీడీపీ యువ నేత నారా లోకేష్ అంటున్నారు. రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్తును అందించిన ఘనత తమకే దక్కిందని, పెరిగిన విద్యుత్ చార్జీలతో సామాన్యుడిపై భారం పడబోదని వ్యాఖ్యానించారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నిక ఒక వ్యక్తి స్వార్థంతో వచ్చిందన్న లోకేష్, వారికి బుద్ధి వచ్చేలా ప్రజలు తీర్పును ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సాయం తీసుకురావడంలో నిరంతరం పోరాటం చేస్తామన్నారు.