: ఈ వరల్డ్ కప్ లో పోటీ ఎక్కువ: గవాస్కర్
ఈసారి టైటిల్ రేసులో అనేక జట్లున్నాయని, అందుకే, ఈ వరల్డ్ కప్ లో పోటీ ఎక్కువని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. చాలా జట్లు బలంగా కనిపిస్తున్నాయని, విజేత ఎవరో ఊహించడం కష్టమని తెలిపాడు. బహుశా అత్యంత పోటీ నెలకొన్న వరల్డ్ కప్ ఇదే కావచ్చని అన్నాడు. జర్నలిస్టు ఆశిష్ రే రచించిన 'క్రికెట్ వరల్డ్ కప్-ద ఇండియన్ చాలెంజ్' పుస్తకానికి రాసిన ముందుమాటలో సన్నీ పైవిధంగా పేర్కొన్నాడు. టోర్నీలో జట్లను చూస్తుంటే "ఈసారి ఆస్ట్రేలియా గెలుస్తుందా? లేక, బ్రెండన్ మెకల్లమ్ నాయకత్వంలో అద్భుతంగా ఆడుతున్న న్యూజిలాండ్ విజేతగా అవతరిస్తుందా? భారత్ టైటిల్ నిలబెట్టుకుంటుందా? దక్షిణాఫ్రికా ఇప్పుడైనా కప్ సాధిస్తుందా?" అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఈ దిగ్గజం పేర్కొన్నాడు.