: మరోసారి అలా జరిగితే పాక్ పై యుద్ధానికి దిగే ఆలోచనలో మోదీ: అమెరికా మాజీ రాయబారి
మరోసారి ఇండియాపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన పక్షంలో ఆ దేశంపై సైనిక దాడి చేసేందుకు ప్రధాని మోదీ మొగ్గుచూపవచ్చని భారత్ లో అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్ బ్లాక్ విల్ అంచనా వేశారు. గతంలో లాగా ప్రవర్తిస్తే తమకే కీడు జరుగుతుందని పాకిస్తాన్ కు కూడా తెలుసునని ఆయన అన్నారు. ఇండియా పార్లమెంట్ పై ఉగ్రవాద దాడి జరిగి 15 సంవత్సరాలు అవుతోందని గుర్తు చేసిన ఆయన, ఆ ఘటన తరువాత ప్రతి భారత ప్రధాని పాకిస్తాన్ పై గట్టి చర్యలు తీసుకోవాలని భావించి కూడా వెనకడుగు వేశారని, మోదీ మాత్రం అలా చేయబోరని ఆయన వివరించారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు తెలిసినంత వరకూ, మోదీ సర్దుకుపోయే వ్యక్తి కాదని అన్నారు.