: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు... రూ.300 కోట్లు వస్తుందనుకుంటే రూ.300 కూడా రాలా!


ఎర్ర చందనం వేలం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆశలు గంగలో కలిసాయి. తొలివిడత వేలం ద్వారా రూ.300 కోట్ల రూపాయలు ఖజానాకు చేరుతుందని భావించగా రూ.300 కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎర్రచందనం కొనుగోలు టెండరు దక్కించుకున్న దుబాయ్ సంస్థ డైమండ్ స్టార్ చేతులు ఎత్తేయడమే ఇందుకు కారణం. మొదటి విడత ఈ వేలంలో పెట్టిన 4,169 టన్నుల్లో 2,694 టన్నులకు మాత్రమే టెండర్లు ఖరారైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 569.99 టన్నుల టెండరు కైవసం చేసుకున్న డైమండ్ స్టార్ డబ్బు చెల్లించకుండా ముఖం చాటేయడం ప్రభుత్వానికి నిరాశ కలిగించింది. డైమండ్ స్టార్ మార్గంలో ఇతర కంపెనీలు నడిస్తే ఒక్క పైసా కూడా ఖజానాకు వచ్చే అవకాశం లేనట్టే. ఇదిలావుండగా, ఈ నెలలోనే రెండో విడత ఈ-వేలం నోటిఫికేషన్ జారీచేస్తామని రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి వివరించారు.

  • Loading...

More Telugu News