: ఆ నిధులు ఏ మూలకూ సరిపోవు: ఏపీ ప్యాకేజీపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పెదవి విరిచారు. రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతూ వస్తున్న ఆయన, ఏపీకి ప్రత్యేక నిధుల విడుదలకు సంబంధించి కేంద్రం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన నిధులు ఏపీకి ఏ మూలకూ సరిపోవని ఆయన కొద్దిసేపటి క్రితం విజయనగరంలో వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఏపీకి మరింత మేర నిధులివ్వాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విన్నవించారు.