: కేసీఆర్... దమ్ముంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకురా!: పొన్నం ప్రభాకర్ సవాల్


తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి గురువారం సవాల్ విసిరారు. ఢిల్లీ పర్యటనకు వెళుతున్న కేసీఆర్, దమ్ముంటే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణను తానే తెచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్, అవే శక్తి సామర్థ్యాలు ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు తీసుకుని రావాలన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగిస్తున్న కేసీఆర్, రెండు రాష్ట్రాలకు సరిపోయేలా ఉన్న సచివాలయాన్ని అమ్మడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి ఆస్తులను సమకూర్చాలి తప్ప ఉన్న ఆస్తులను తెగనమ్మడం సరికాదని ఆయన ఆన్నారు.

  • Loading...

More Telugu News