: యువ సంగీత దర్శకుడి పరిస్థితి విషమం


ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు, యువ సంగీత దర్శకుడు శ్రీ అనారోగ్యంతో కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శ్రీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, శ్రీ తెలుగులో 'సింధూరం', 'గాయం', 'అమ్మోరు', 'అనగనగా ఒకరోజు'తో పాటు దాదాపు 20 చిత్రాలకు సంగీతం అందించారు. శ్రీ పాడిన 'జగమంత కుటుంబం నాది' పాట అద్భుతమైన ప్రజాదరణ పొందింది. కృష్ణవంశీ సినిమాలకు ఎక్కువ పనిచేసిన శ్రీ, తాజాగా గోపీచంద్ నటించిన 'సాహసం' సినిమాకి సంగీతం అందించారు.

  • Loading...

More Telugu News