: మోదీని ఆరాధిస్తానన్న హాలీవుడ్ సూపర్ స్టార్


భారత ప్రధాని నరేంద్ర మోదీని హాలీవుడ్ సూపర్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ అర్నాల్డ్ ష్వాజనేగర్ ఆకాశానికెత్తేశారు. మోదీ ఆలోచనా విధానాలను తానెంతో ఆరాధిస్తానని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు... కెనాల్స్ పై సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను అధిగమించడానికి ఆయన చేసిన ప్రయత్నం అమోఘమని చెప్పారు. మోదీ వ్యవహారశైలిని తాను ఎప్పటి నుంచో గమనిస్తున్నానని అర్నాల్డ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన 'ఢిల్లీ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సమ్మిట్' కార్యక్రమం సందర్భంగా అర్నాల్డ్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News