: నయనతార బీర్లు కొన్నదని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు!


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అందులో, సినీ తార నయనతార ఓ మద్యం దుకాణంలో రెండు బీర్లు కొంటున్నట్టు ఉంది. అదే వీడియోలో... కొందరు నయనతార చర్యపై ఆగ్రహించడం, ఆమె దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం కూడా కనిపిస్తుంది. దీంతో, నయనతారకు స్పందించక తప్పలేదు. ఓ సినిమా సన్నివేశానికి అనుగుణంగానే తాను బీర్లు కొన్నానని, దర్శకుడు చెప్పినట్టు చేశానని స్పష్టం చేసింది. తప్పు చేయలేదని తెలిపింది. మీడియాలో కూడా నయనతారకు మద్దతుగానే వార్తలు వస్తున్నాయి. ఆమె సినిమా షూటింగులో భాగంగానే బీర్లు కొన్నదని చానళ్లు పేర్కొంటున్నా అభిమానుల ఆగ్రహం మాత్రం చల్లారలేదట.

  • Loading...

More Telugu News