: తృణమూల్ కాంగ్రెస్ కు సృంజయ్ బోస్ రాజీనామా


శారదా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృంజయ్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపినట్టు సమాచారం. అటు, పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. శారదా చిట్ ఫండ్ స్కాంలో కొన్ని నెలల కిందట అరెస్టైన ఆయన బెయిల్ పై నిన్ననే విడుదలయ్యారు. ఆ మరుసటిరోజే పార్టీ నుంచి వైదొలగడం గమనార్హం. ఇందుకుగల కారణాలు మాత్రం తెలియరాలేదు. చిట్ ఫండ్ స్కాంలో ఇప్పటికే పలువురు తృణమూల్ నేతలు, ఎంపీలు, మంత్రులను విచారించిన సీబీఐ పలువురిని అరెస్టు చేసింది.

  • Loading...

More Telugu News