: తలచుకుంటే కూల్చేస్తానన్నాడు... అంతలోనే మాటమార్చాడు!
బీజేపీ నేత, వున్నావో (ఉత్తరప్రదేశ్) ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు వార్తల్లోకెక్కుతుంటారు. తాను తలచుకుంటే మోదీ సర్కారు సైతం కూలిపోతుందని వ్యాఖ్యానించిన ఈ మహాశయుడు అంతలోనే మాటమార్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, మోదీ ఓ దివ్యశక్తి అని కీర్తించారు. తాను మోదీకి సైనికుడిలాంటి వాణ్ణని, అలాంటప్పుడు సర్కారును ఏర్పాటు చేస్తానని, లేక, కూల్చేస్తానని ఎలా అంటాను? అని ప్రశ్నించారు. ఏ మూర్ఖుడూ అంతటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయబోడని అన్నారు. మోదీ సామాన్య వ్యక్తి కాదని, భారత్ ను అభివృద్ధి పథంలో నడిపి, తద్వారా, ప్రపంచంలోనే దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న ఆయన ఆలోచన సామాన్యుడి ఊహకందనిదని మహారాజ్ పేర్కొన్నారు.