: రాజ్ నాథ్ ఇంటి ముట్టడికి క్రైస్తవుల యత్నం... వందలాది మంది ఆందోళనకారుల అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో క్రైస్తవులు ఆందోళన బాటపట్టారు. ఇటీవల నగరంలోని పలు చర్చిలపై జరిగిన దాడులకు నిరసనగా నేటి ఉదయం క్రైస్తవులు ఆందోళనకు దిగారు. పోలీసుల అడ్డగింత నేపథ్యంలో ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు, క్రైస్తవుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన పోలీసులు వందలాది మంది క్రైస్తవులను అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.