: ఏపీకి 850 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కేంద్రం విడుదల చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక శాఖ 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా 2014-2015 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను పారిశ్రామిక ప్రోత్సాహకాలకు వినియోగించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయంగా 500 కోట్ల రూపాయలను విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 850 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందనుంది.