: అతడిపై ఎంత ఒత్తిడి ఉంటే అంత రాణిస్తాడు: హర్భజన్


తనదైన రోజున ఎంతటి లక్ష్యమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ముందు బలాదూరేనని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. అతడిపై ఎంత ఒత్తిడి నెలకొంటే అంతగా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, రహానేతో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోందని, వారికి బౌలర్ల నుంచి కూడా సహకారం అందితే టోర్నీలో మంచి ఫలితాలు వస్తాయని భజ్జీ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ ను నిలబెట్టుకోవాలంటే ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి తదితరులు జహీర్ ఖాన్ స్థాయిలో రాణించాల్సి ఉంటుందని సూచించాడు.

  • Loading...

More Telugu News