: కారును ఢీకొన్న రైలు... ఆరుగురి మృతి


రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటుతున్న కారును రైలు ఢీకొనడంతో అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలపైకి వచ్చిన కారును రైలు వచ్చి ఢీకొనడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ లోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరగా, నగర శివారులో ప్రమాదం జరిగింది. వల్హెల్లాలోని స్టేషన్లో ప్రమాదం జరిగిందని మెట్రోపాలిటన్ రవాణా అధికారులు తెలిపారు. ఆ కారును నడుపుతున్న మహిళ తన వాహనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే రైలు ఢీకొట్టిందని వారు వివరించారు. ఆమెతో పాటు కారులోని మరో ఐదుగురు వ్యక్తులు మరణించారని రైల్వే అధికారులు ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News