: చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడు... సంభ్రమాశ్చర్యాల్లో కుటుంబ సభ్యులు


చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి రావడంతో అతడి కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లా మరిపెట మండలం జీన్యాతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. జీన్యాతండాకు చెందిన రైతు బానోతు ధర్మ తన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయంతో పూడిక తీయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయాడని తేల్చేశారు. చేసేదేమీలేక చనిపోయాడనుకున్న అతనిని తీసుకుని కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. అప్పటికే ధర్మ చనిపోయాడని తండాకు సమాచారం రావడంతో బంధువులు పాడె కూడా సిద్ధం చేశారు. ఇంటికి తీసుకొచ్చిన సదరు వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి అతడి చుట్టూ చేరిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలో ధర్మ ఒక్కసారిగా లేచి, ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు అతడిని మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News