: రెండెకరాలు కేటాయించండి...5 కోట్లతో అతిథి గృహం నిర్మిస్తాం: రాజస్థాన్ సీఎంకు కేసీఆర్ లేఖ


రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ భక్తుల కోసం అతిథి గృహం నిర్మించేందుకు రెండెకరాల స్థలం కేటాయించాలని ఆయన లేఖలో కోరారు. రాజస్థాన్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే 5 కోట్ల రూపాయలతో గృహనిర్మాణం చేపడతామని ఆయన లేఖలో తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ గతంలో పలుమార్లు అజ్మీర్ దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News