: వైద్యులు పారిపోతున్నారు...నర్సులు వైద్యం చేయమంటున్నారు!


వైద్యులు చికిత్స చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకా ఇబ్బంది పెడితే సెలవు లేదా ఇతర పనులు అంటూ పారిపోతున్నారు. పోనీ నర్సులను వైద్యం చేయయని కోరితే సమస్యలు నెత్తికెత్తుకోవడం ఎందుకంటూ వెనకడుగు వేస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో నెలకొన్న తీరు. స్వైన్ ఫ్లూ కేసులు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల్లో నమోదవుతుండడంతో వైద్యులు బెంబేలెత్తిపోతున్నారు. అరకొర సౌకర్యాలతో ఉన్న పీహెచ్ సీలకు స్వైన్ ఫ్లూ కేసులు వస్తుండడంతో రోగాన్ని నిర్ధారించేందుకు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 'రోగం నిర్ధారించే సౌకర్యాలు హైదరాబాదులో ఉన్నాయి. శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ రోగి చేరితే, రోగం నిర్ధారణ అయ్యేది ఎప్పుడు? అతనికి చికిత్స ప్రారంభించేంది ఎప్పుడు?' అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. విధుల్లో ఉన్న నర్సులను సంప్రదిస్తే తమకు ఎలాంటి అధికారాలు లేవని, డాక్టర్లు లేనిదే తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 668 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News