: దావూద్ ఇబ్రహీం తమ్ముడిపై కేసు నమోదు
అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం తమ్ముడు ఇక్బాల్ కస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంటుపై దాడికి యత్నించడమే గాకుండా, అతడి నుంచి రూ.3 లక్షలు లాక్కునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కస్కర్ తో పాటు అతడి అనుచురులిద్దరిపై కేసు నమోదు చేశారు. ముంబయి జేజే మార్గ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2004లో యూఏఈ నుంచి వచ్చిన తర్వాత కస్కర్ ముంబయిలో హత్య, కుట్ర కేసుల్లో నాలుగేళ్లు జైలులో ఉన్నాడు. అనంతరం ఆ రెండు కేసుల్లో నిర్దోషిగా తేలాడు.